Chandrababu: అబద్ధాలు చెప్పడంలో తండ్రిని మించిన తనయుడు లోకేశ్: ఎంపీ విజయసాయిరెడ్డి

  • చైనాలో కన్నా ఏపీలోనే ఎక్కువ మొబైల్స్ తయారట  
  • లోకేశ్ అబద్ధాలు చెప్పి దేశం పరువు తీస్తున్నారు
  • అబద్ధాలు చెప్పడంలో తండ్రిని మించిన లోకేశ్  
తండ్రీకొడుకులు చంద్రబాబు, లోకేశ్ పై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మరోసారి విమర్శలు చేశారు. అబద్ధాలు చెప్పడంలో లోకేశ్ తన తండ్రి చంద్రబాబును మించిపోయాడని విమర్శించారు. చంద్రబాబు పది చెబితే.. లోకేశ్ వంద అబద్ధాలు చెప్పే స్థాయికి ఎదిగిపోయాడని అన్నారు. చైనాలో కన్నా ఏపీలోనే ఎక్కువ మొబైల్స్ తయారవుతున్నాయని లోకేశ్ అబద్ధాలు చెప్పి దేశం పరువు తీస్తున్నారని ఘాటు వ్యాఖ్యలు చేశారు.

కాగా, పెద్ద పెద్ద అంశాలపై మాట్లాడితే తన స్థాయి పెరుగుతుందని ఎవరో లోకేశ్ కు సలహా ఇచ్చారని, కేంద్రంలోని అధికార పార్టీ చెప్పినట్టుగా సీబీఐ నడచుకుంటోందట అని విమర్శించారు. చంద్రబాబు నాటి కేంద్ర మంత్రి చిదంబరం కాళ్లు పట్టుకుని జగన్ పై అక్రమ కేసులు పెట్టించారని, ఆ కేసులు నిలవవని అర్థమయ్యాక అదే సీబీఐపై నిందలకు దిగుతున్నారని ఓ ట్వీట్ లో దుయ్యబట్టారు.
Chandrababu
Nara Lokesh
YSRCP
mp
vijyasai

More Telugu News