ntr: ఎన్టీఆర్ బయోపిక్ ప్రదర్శనపై కేఈ ప్రభాకర్ తో చర్చించిన బాలకృష్ణ

  • జన్మభూమి కార్యక్రమంలో ఉండగా బాలయ్య నుంచి కేఈకి ఫోన్
  • ఎన్టీఆర్ బయోపిక్ ప్రదర్శన కోసం తగు చర్యలు తీసుకోవాలని చెప్పిన బాలయ్య
  • అభిమాన సంఘాలతో మాట్లాడాలని సూచన
టీడీపీ ఎమ్మెల్యే కేఈ ప్రభాకర్ కు ప్రముఖ సినీ నటుడు, ఎమ్మెల్యే బాలకృష్ణ ఫోన్ చేశారు. నిన్న కర్నూలు జిల్లా మెట్టుపల్లి గ్రామంలో జరిగిన జన్మభూమి కార్యక్రమానికి కేఈ ప్రభాకర్ హాజరయ్యారు. కార్యక్రమంలో ఆయన ప్రసంగిస్తుండగా... అదే సమయంలో బాలయ్య నుంచి ఆయనకు ఫోన్ వచ్చింది. వెంటనే పక్కకు వెళ్లి కాసేపు ఫోన్ మాట్లాడారు. ఆ తర్వాత తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ... ఈనెల 9వ తేదీన ఎన్టీఆర్ బయోపిక్ సినిమా విడుదల అవుతోందని... ఈ విషయంపైనే బాలయ్య తనతో చర్చించారని చెప్పారు. సినిమా ప్రదర్శన కోసం తగు చర్యలు తీసుకోవాలని... అభిమాన సంఘాలతో మాట్లాడాలని బాలయ్య చెప్పినట్టు తెలిపారు.
ntr
biopic
Balakrishna
ke prabhakar

More Telugu News