suddala ashok teja: నాకు నచ్చిన హీరోయిన్ సాయిపల్లవి: సుద్దాల అశోక్ తేజ

  • సాయిపల్లవి తెలంగాణ యాస నేర్చుకుంది 
  • కన్నీళ్లు పెట్టించే పాత్రలో మెప్పించింది 
  • అలనాటి తారల్లో సావిత్రిగారంటే అభిమానం
తెలుగు సినీ పాటల రచయితగా సుద్దాల అశోక్ తేజకి మంచి గుర్తింపు వుంది. జానపద గీతాలను జనం గుండెలకి హత్తుకునేలా రాయడం ఆయన ప్రత్యేకత. అలాంటి సుద్దాల అశోక్ తేజ .. ఐ డ్రీమ్స్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ అనేక విషయాలను పంచుకున్నారు. 'మీకు బాగా నచ్చిన హీరోయిన్ ఎవరు?' అనే ప్రశ్న ఆయనకి ఎదురైంది. అందుకు ఆయన స్పందిస్తూ .."ఇప్పుడున్నవారిలో నాకు బాగా నచ్చిన హీరోయిన్ సాయిపల్లవి అని చెప్పాలి.

సాయిపల్లవి తెలుగు అమ్మాయి కాదు. తెలంగాణ యాస నేర్చుకుని 'ఫిదా' సినిమాలో తన పాత్రను అద్భుతంగా పోషించింది. ఇంతకుముందు తెలంగాణ యాసను కామెడీకి .. విలనిజానికి ఉపయోగిస్తూ వచ్చారు. అలాంటిది కన్నీళ్లు పెట్టించే పాత్రలో సైతం తెలంగాణ యాసను అద్భుతంగా పలికిస్తూ ఆ పాత్రకి న్యాయం చేసింది. అందువలన సాయిపల్లవి అంటే ఇష్టం. ఇక పాత తరం కథానాయికలలో నాకు సావిత్రి గారంటే అభిమానం" అని ఆయన చెప్పుకొచ్చారు.
suddala ashok teja

More Telugu News