Andhra Pradesh: తల్లికి కాఫీ అందిస్తూ కుప్పకూలిన యువ జడ్జి.. ఆసుపత్రికి తరలించేలోపే మృతి!

  • ఏపీలోని గుంటూరు జిల్లాలో ఘటన
  • పట్టణ 1వ అదనపు జూనియర్ సివిల్ జడ్జిగా పనిచేస్తున్న ఐశ్వర్య
  • పరామర్శించిన ఏపీ స్పీకర్ కోడెల
ఆంధ్రప్రదేశ్ కు చెందిన యువ జడ్జి ఒకరు ఈరోజు ఉదయం అకస్మాత్తుగా కన్నుమూశారు. గుంటూరు జిల్లాలో పట్టణ 1వ అదనపు జూనియర్ సివిల్ జడ్జిగా విధులు నిర్వర్తిస్తున్న ఐశ్వర్య(25) ప్రాణాలు కోల్పోయారు. ఈరోజు ఉదయం తల్లికి కాఫీ ఇస్తూ ఆమె ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. దీంతో కుటుంబ సభ్యులు ఆమెను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు.

అయితే ఐశ్వర్య అప్పటికే ప్రాణాలు కోల్పోయినట్లు ఆమెను పరీక్షించిన వైద్యులు నిర్ధారించారు. జడ్జిగా పనిచేస్తున్న ఐశ్వర్య కోర్టు బంగళాలోనే తల్లిదండ్రులతో కలిసి ఉంటున్నారు. నిన్న ఇంట్లో జారిపడటంతో ఆమె స్వల్పంగా అస్వస్థతకు లోనయ్యారు. కాగా, ఐశ్వర్య కుటుంబాన్ని ఏపీ స్పీకర్ కోడెల శివప్రసాద్, పలువురు న్యాయవాదులు పరామర్శించారు.
Andhra Pradesh
Guntur District
judge
dead
kodela

More Telugu News