chiranjeevi: 'బిగ్ బాస్ 3' హోస్ట్ గా చిరంజీవి?

  • 'బిగ్ బాస్ 3'కి సన్నాహాలు
  •  వెంకటేశ్ తో సంప్రదింపులు
  •  చిరంజీవితో చర్చలు
స్టార్ మా ఛానల్ లో ప్రసారమైన 'బిగ్ బాస్' .. 'బిగ్ బాస్ 2' మంచి సక్సెస్ అయ్యాయి. దాంతో ఈ ఛానల్ వారు 'బిగ్ బాస్ 3' చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నారు. 'బిగ్ బాస్ 2' కి హోస్ట్ గా వ్యవహరించే సమయంలో నాని కొన్ని విమర్శలను ఎదుర్కున్నాడు. అందువలన తాను 'బిగ్ బాస్ 3'కి హోస్ట్ గా వ్యవహరించనని ఆయన చెప్పాడట. దాంతో ఛానల్ నిర్వాహకులు వెంకటేశ్ ను సంప్రదిస్తున్నట్టుగా వార్తలు వచ్చాయి.

తాజాగా చిరంజీవి పేరు తెరపైకి వచ్చింది. రీసెంట్ గా 'బిగ్ బాస్ 3' నిర్వాహకులు చిరంజీవిని కలిసి ఆయనతో ఈ కార్యక్రమాన్ని గురించి చర్చలు జరిపారని సమాచారం. ఆయనని ఒప్పించడానికి వాళ్లు ప్రయత్నిస్తున్నట్టుగా చెబుతున్నారు. గతంలో చిరంజీవి ఇదే ఛానల్లో 'మీలో ఎవరు కోటీశ్వరుడు'కి హోస్ట్ గా వ్యవహరించిన సంగతి తెలిసిందే. చిరంజీవి .. వెంకటేశ్ ఎవరి సినిమాలతో వాళ్లు బిజీగా వున్నారు. ఇద్దరిలో ఎవరు ఒప్పుకున్నా ఓకే చెప్పేయాలనే నిర్ణయంతో నిర్వాహకులు ఉన్నట్టుగా తెలుస్తోంది.
chiranjeevi
venkatesh

More Telugu News