Andhra Pradesh: చంద్రబాబును బీజేపీ నేతలు అసభ్య పదజాలంతో తిడుతుంటే.. మోదీ ఆస్వాదిస్తున్నారు!: నారా లోకేశ్ ఆగ్రహం

  • పెద్దన్నగా ఉండాల్సిన వ్యక్తి నవ్వుతున్నారు
  • హోదా కోసం ప్రధానిని నిలదీయడం తప్పా? 
  • ట్విట్టర్ లో స్పందించిన ఏపీ మంత్రి
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని బీజేపీ నేతలు తిడుతుంటే ప్రధాని నరేంద్ర మోదీ ఆస్వాదిస్తున్నారని ఏపీ మంత్రి నారా లోకేశ్ విమర్శించారు. దేశానికి పెద్దన్నగా ఉండాల్సిన వ్యక్తి ఈ దూషణలను ఆస్వాదించడం దేనికి సంకేతమని ప్రశ్నించారు. ఏపీకి ప్రత్యేకహోదా కోసం, హక్కుల పరిరక్షణ కోసం కేంద్రంపై పోరాడటం నేరమా? అని నిలదీశారు. ఈ మేరకు లోకేశ్ ట్విట్టర్ లో స్పందించారు.

బీజేపీ, ప్రధాని వ్యవహారశైలిపై ఈరోజు ఉదయం స్పందిస్తూ..‘హోదాకోసం మోడీగారిని నిలదీయడం తప్పా? హక్కుల పరిరక్షణ కోసం కేంద్రంపై పోరాటం చెయ్యడం నేరమా? ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు గారిని బీజేపీ నాయకులు అసభ్య పదజాలంతో తిడుతుంటే సుదీర్ఘ అనుభవం ఉండి, దేశానికి పెద్దన్నగా ఉండాల్సిన ప్రధాని మోడీ గారు నవ్వుతూ ఆస్వాదించడం దేనికి సంకేతం?’ అంటూ లోకేశ్ ట్వీట్ చేశారు.
Andhra Pradesh
Chandrababu
Nara Lokesh
Telugudesam
BJP
modi
Narendra Modi

More Telugu News