Jagan: 'ఏపీ టీఆర్ఎస్' అధ్యక్షుడిగా పనిచేస్తూ రాష్ట్రానికి ద్రోహం చేస్తున్నారు: జగన్‌కు కళా వెంకట్రావు బహిరంగ లేఖ

  • రాష్ట్రానికి ద్రోహం చేస్తున్నారు
  • వేతనం తీసుకోవడం నైతికతా?
  • పాదయాత్ర ద్వారా ఏం సాధించారు?
వైసీపీ అధినేత జగన్ 'ఏపీ టీఆర్ఎస్' అధ్యక్షుడిగా పనిచేస్తూ రాష్ట్రానికి ద్రోహం చేస్తున్నారని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఏపీ మంత్రి కళా వెంకట్రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. నేడు జగన్‌కు కళా వెంకట్రావు బహిరంగ లేఖ రాశారు. ఈ లేఖలో ఆయన వైసీపీ ఏపీ టీఆర్ఎస్ పార్టీగా మారిందని ఆరోపించారు. అసెంబ్లీకి రాకుండా ఆ పార్టీ ఎమ్మెల్యేలు వేతనాలు తీసుకోవడం నైతికతా? అని ప్రశ్నించారు. 2014లో ప్రజలు వైసీపీని నమ్మలేదని.. 2019లో నమ్మబోరని అన్నారు. వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి పీఎంవోలో ఏం చేస్తున్నారని... పాదయాత్ర ద్వారా జగన్ ఏం సాధించారో చెప్పాలని కళా వెంకట్రావు లేఖలో నిలదీశారు. 
Jagan
Kala Venkat Rao
TRS
YSRCP
Assembly

More Telugu News