Susmithasen: రెండు మనసులు ఒక్కటయ్యాయి.. ఐలవ్ యు రోమన్!: సుస్మితా సేన్

షార్ట్స్‌లో చూడండి
కొన్ని రోజులుగా మాజీ విశ్వసుందరి సుస్మితా సేన్, మోడల్ రోమన్‌ షాల్‌లు ప్రేమలో ఉన్నారంటూ వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. వీరిద్దరూ ఈ ఏడాది పెళ్లి చేసుకోబోతున్నారంటూ ప్రచారం కూడా జరిగింది. అయితే దీనిని సుస్మిత ఖండించారు. కానీ నేడు రోమన్ పుట్టినరోజు సందర్భంగా సుస్మిత రోమన్‌పై తనకున్న ప్రేమను సోషల్ మీడియా వేదికగా తెలిపారు.

రోమన్‌తో కలిసి వర్కవుట్ చేస్తున్న ఫోటోలు, వీడియోలతో సుస్మిత పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. ‘‘‘పుట్టినరోజు శుభాకాంక్షలు మై ‘రో’. ప్రపంచంలోని ఆనందం మొత్తం నీకు దక్కాలని కోరుకుంటున్నాను. మన రెండు మనసులు ఒక్కటయ్యాయి. ఇది అందమైన ఏడాది కాబోతోంది. ఐ లవ్ యు’ అని ఆమె పోస్ట్‌ చేశారు. అలాగే ‘రోమన్‌తో నా జీవితం ఓ అందమైన కవితగా మారింది. ఆయనెప్పుడూ సంతోషంగా ఉండాలి’ అని పేర్కొంటూ సుస్మిత ఓ వీడియోను షేర్‌ చేశారు.
Go Back to Shorts
Susmithasen
Roman Shal
Social Media
Birthday

More Telugu News