Nara Lokesh: ఆంధ్రా పప్పూజీ, జోకర్ ఎవరో అందరికీ తెలుసులెండి!: లోకేశ్ పై బీజేపీ సెటైర్

  • బీజేపీ అంటే దేశం కోసం, ప్రజల కోసం పని చేస్తుంది
  • నమ్మి ఓటు వేసిన ప్రజల్ని ‘జోకర్స్’ చేశారు
  • కాంగ్రెస్ తో చేతులు కలిపిన పొలిటికల్ ‘బ్రోకర్స్’ మీరు
ఏపీ సీఎం చంద్రబాబునాయుడిని కాకినాడలో అడ్డుకునేందుకు బీజేపీ నాయకులు యత్నించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీపైనా, బీజేపీపైనా మంత్రి నారా లోకేశ్ స్పందిస్తూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలను ఏపీ బీజేపీ తిప్పికొడుతూ ఘాటుగా స్పందించింది.

"ఆంధ్రా పప్పూజీ, జోకర్ ఎవరో అందరికీ తెలుసులెండీ, మీరు పెట్టిన ట్వీట్ నిజంగా మీరు స్వయంగా రాసి, చదవగలరా? బీజేపీ అంటే దేశం కోసం, ప్రజల కోసం పని చేస్తుంది.. నమ్మి ఓటు వేసిన ప్రజల్ని ‘జోకర్స్’ చేసి కాంగ్రెస్ తో చేతులు కలిపిన పొలిటికల్ ‘బ్రోకర్స్’ మీరు.. మీ ‘40 ఇయర్స్ ఇండస్ట్రీ’ గారు" అంటూ నిప్పులు చెరిగారు.  
Nara Lokesh
Telugudesam
bjp
Chandrababu
cm

More Telugu News