nellore: నెల్లూరు జిల్లా రాజకీయం పది కుటుంబాల చేతుల్లో చిక్కుకుంది!: పవన్ కల్యాణ్

  • నెల్లూరు జిల్లా రాజకీయాల్లోకి కొత్తతరం రావాలి
  • లేకపోతే అన్యాయం చేసిన వారమవుతాం
  • యువతరాన్ని రాజకీయ యవనికపై నిలపాలి
నెల్లూరు జిల్లా రాజకీయం పది కుటుంబాల చేతుల్లో చిక్కుకుందని జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ విమర్శించారు. విజయవాడలోని జనసేన పార్టీ కార్యాలయంలో నెల్లూరు జిల్లా జనసేన పార్టీ నాయకులతో పవన్ సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నెల్లూరు జిల్లా రాజకీయాల్లోకి కొత్తతరం రాకుంటే అన్యాయం చేసిన వారిమవుతామని, యువతరాన్ని రాజకీయ యవనికపై నిలపాలని దృఢ నిశ్చయంతో ఉన్నానని స్పష్టం చేశారు. వారసత్వంతో వచ్చిన కుటుంబాలను రాజకీయంగా ఎదుర్కోవాలని, యువత శక్తియుక్తులతో పనిచేస్తూ ప్రజలకు చేరువ కావాలని పిలుపు నిచ్చారు. ఈ నెల 9 తర్వాత జనసేన పార్టీ జిల్లా కమిటీని ప్రకటిస్తానని, కొత్తతరంపై వివిధ రూపాల్లో దాడులు జరిగే ప్రమాదం ఉందని, ఈ దాడులను తట్టుకునే శక్తి జనసైనికులకు ఉందని భావిస్తున్నానని పవన్ అన్నారు.
nellore
jana sena
Pawan Kalyan

More Telugu News