Andhra Pradesh: ఆంధ్రా మోదీని కాపాడేందుకు సీబీఐని అలా మార్చారు: నారా లోకేశ్

  • సీబీఐ ఇప్పుడు బీబీఐగా మారిపోయింది 
  • ప్రజా ధనాన్ని జగన్ నిలువునా దోచేశాడు
  • జగన్ కి కేసుల నుండి విముక్తికి కేంద్రం మరో కుట్ర 
ఆస్తుల కేసులో జగన్ దాఖలు చేసిన డిశ్చార్జ్ పిటిషన్లపై సీబీఐ కోర్టు మళ్లీ విచారణ చేపట్టనుంది. రెండున్నరేళ్లుగా వీటిపై విచారణ కొనసాగుతోంది. అయితే, సీబీఐ కోర్టు న్యాయమూర్తి వెంకట రమణను ఏపీకి కేటాయించడంతో ఆయన బదిలీ అయ్యారు. కొత్తగా వచ్చే న్యాయమూర్తి ఈ డిశ్చార్జ్ పిటిషన్లపై మళ్లీ వాదనలు వినాల్సి ఉంటుంది.

ఈ నేపథ్యంలో ఏపీ మంత్రి నారా లోకేశ్ స్పందించారు. ప్రధాని మోదీ, సీబీఐ, జగన్ పై ఆయన విమర్శలు గుప్పించారు. సీబీఐ ఇప్పుడు 'బీబీఐ'గా మారిందనడానికి ఇంత కన్నా మంచి ఉదాహరణ ఏమి ఉంటుందని ప్రశ్నించారు. ఆంధ్రా మోదీని కాపాడటానికి ఢిల్లీ మోదీ, సీబీఐని బీజేపీ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ గా మార్చేశారని ఆరోపించారు. ప్రజా ధనాన్ని నిలువునా దోచిన జగన్ కి కేసుల నుండి విముక్తి కల్పించి ఆంధ్రప్రదేశ్ ని దెబ్బతీయాలని కేంద్ర ప్రభుత్వం మరో కుట్రకి తెరలేపిందని ఆరోపించారు.  
Andhra Pradesh
Prime Minister
Narendra Modi
YSRCP
Jagan
Telugudesam
nara lokesh
bjp

More Telugu News