Telugudesam: టీడీపీ ఎంపీలకు ములాయం సింగ్ మద్దతు.. అనుకూలంగా నినాదాలు!

  • పార్లమెంటు ప్రాంగణంలో కేంద్రానికి వ్యతిరేకంగా టీడీపీ ఎంపీల ఆందోళన
  • వారి వద్దకు వచ్చిన ములాయం సింగ్
  • కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు
ఏపీకి ప్రత్యేక హోదాతో పాటు, విభజన హామీలన్నింటినీ నెరవేర్చాలంటూ పార్లమెంటులో టీడీపీ ఎంపీలు ఆందోళన చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో, 14 మంది టీడీపీ ఎంపీలను సభ నుంచి నిన్న స్పీకర్ సుమిత్రా మహాజన్ నాలుగు రోజుల పాటు సస్పెండ్ చేశారు. దీంతో, ఈరోజు వారంతా పార్లమెంటు ప్రాంగణంలో ప్లకార్డులు పట్టుకుని, ఆందోళన చేశారు. కేంద్ర ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా వారి వద్దకు సమాజ్ వాదీ పార్టీ వ్యవస్థాపకుడు ములాయం సింగ్ వచ్చారు. ఎంపీల ఆందోళనకు తన మద్దతు ప్రకటించారు. వారితో కలసి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
Telugudesam
mp
special status
protest
mulayam singh yadav
parliament

More Telugu News