YSRCP: జగన్ చిత్రం కింద టీఆర్ఎస్ నేతల ఫొటోలు... గడియారాలపై వివరణ ఇచ్చిన వైకాపా!

  • గుజరాత్ కంపెనీకి ఆర్డర్ ఇచ్చాం
  • అదే కంపెనీలో టీఆర్ఎస్ ఆర్డర్ పెట్టింది
  • 165 గడియారాల్లోనే ఇలా జరిగింది
  • మదనపల్లి ఎమ్మెల్యే తిప్పారెడ్డి
చిత్తూరు జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పంచిన గోడ గడియారాల్లో కింద టీఆర్ఎస్ నేతల ఫోటోలు, పైన వైసీపీ నేతల ఫోటోలు ఉన్నాయని చూపిస్తున్న వీడియో వైరల్ కాగా, ఆ పార్టీ ఎమ్మెల్యే దేశాయ్ తిప్పారెడ్డి వివరణ ఇచ్చారు. తాము అహ్మదాబాద్ కు చెందిన ఓ కంపెనీకి 60 వేల గడియారాలను ఆర్డర్ ఇచ్చామని చెప్పిన ఆయన, అంతకుముందే టీఆర్ఎస్ నేత, పెద్దపల్లి ఎమ్మల్యే దాసరి మనోహర్ రెడ్డి కూడా అదే కంపెనీకి ఆర్డర్ ఇచ్చారని చెప్పారు.

వారిచ్చిన ఆర్డర్ లో మిగిలిన గడియారాలపై తమ చిత్రాలను అంటించారని, కేవలం 165 గడియారాల్లో మాత్రమే ఈ తప్పిదం జరిగిందని తిప్పారెడ్డి తెలిపారు. వెంటనే కంపెనీని అప్రమత్తం చేశామని, మిగతా గడియారాలన్నీ సక్రమంగానే వచ్చాయని అన్నారు. ఈ విషయాన్ని తెలుగుదేశం పార్టీ కావాలనే రాజకీయం చేస్తోందని ఆయన విమర్శించారు. 
YSRCP
Telugudesam
TRS
Madanapalli
Desai Tippareddy
Wall Clock

More Telugu News