varun tej: పెళ్లి విషయంలో నా మనసు మారింది: వరుణ్ తేజ్

  • విడుదలకి ముస్తాబవుతోన్న 'ఎఫ్ 2'
  • పెళ్లి చేసుకోమని వత్తిడి చేస్తున్నారు
  • త్వరలోనే పెళ్లి చేసుకుంటాను
మొదటి నుంచి కూడా వరుణ్ తేజ్ ఒక జోనర్ ను ఫిక్స్ చేసుకుని అదే రూట్లో వెళ్లకుండా విభిన్నమైన కథా చిత్రాలను చేస్తూ వెళుతున్నాడు. ఈ కారణంగానే ఒక 'కంచె' .. ఒక 'అంతరిక్షం' ఆయన ఖాతాలో చేరాయి. ఆయన తాజా చిత్రంగా రూపొందిన 'ఎఫ్ 2' ఈ సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానుంది. దాంతో ఆయన ఈ సినిమా ప్రమోషన్స్ లో బిజీగా వున్నాడు.

తాజా ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఉండగా ఆయన పెళ్లి ప్రస్తావన వచ్చింది. అందుకు ఆయన స్పందిస్తూ .."ఇంట్లో పెళ్లి చేసుకోమని వత్తిడి చేస్తున్నారు. అయినా ఒక మూడేళ్లవరకూ పెళ్లి చేసుకోకూడదనే అనుకున్నాను. కానీ ఇప్పుడు పెళ్లి విషయంలో నా మనసు మారింది. త్వరలోనే పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నాను" అని చెప్పుకొచ్చాడు. మెగా ఫ్యామిలీలో త్వరలోనే పెళ్లి బాజాలు మోగనున్నాయన్న మాట. 
varun tej

More Telugu News