ramayakrishna: జయలలిత పాత్రకి రమ్యకృష్ణ ఖాయమైపోయినట్టే!

  • అమ్మ బయోపిక్ కి సన్నాహాలు 
  • వెబ్ సిరీస్ ప్లాన్ చేసిన గౌతమ్ మీనన్ 
  • త్వరలోనే షూటింగ్ మొదలు  
మాజీ ముఖ్యమంత్రి దివంగత జయలలిత తమిళ ప్రజల మనసుల్లో చెరగని ముద్ర వేశారు. అక్కడి ప్రజల్లో ఆమెకు విశేషమైన ఆదరణ వుంది. అలాంటి జయలలిత బయోపిక్ ను తెరపైకి తీసుకురావడానికి కొంతమంది దర్శక నిర్మాతలు చకచకా సన్నాహాలు చేసేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో జయలలిత జీవితచరిత్రను వెబ్ సిరీస్ గా తీసుకురావడం కోసం దర్శకుడు గౌతమ్ మీనన్ రంగంలోకి దిగారు.

 జయలలిత జీవిత చరిత్రను రెండున్నర గంటల్లో చెప్పడం సాధ్యం కాదని భావించిన ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. 32 ఎపిసోడ్స్ గా ఆయన ఈ వెబ్ సిరీస్ ను ప్లాన్ చేశారు. జయలలిత పాత్ర కోసం రమ్యకృష్ణను సంప్రదిస్తున్నట్టుగా ఆ మధ్య వార్తలు వచ్చాయి. ఆమెనే ఎంపిక చేశారనేది తాజా సమాచారం. త్వరలోనే ఈ వెబ్ సిరీస్ షూటింగ్ మొదలుకానుంది. గతంలో జయలలిత పాత్రను పోషించడానికి రమ్యకృష్ణ ఆసక్తిని వ్యక్తం చేసింది. ఆ అవకాశం ఆమెకి రావడం నిజంగా అదృష్టమే. 
ramayakrishna

More Telugu News