YSRCP: జగన్ పాదయాత్రకు ముగింపు ఎలా?... నేడు వైకాపా కీలక సమావేశం!

  • 9వ తేదీతో ముగియనున్న పాదయాత్ర
  • నేడు 10 నియోజకవర్గాల నేతల సమావేశం
  • వెల్లడించిన తమ్మినేని సీతారాం
దాదాపు 400 రోజులుగా సాగుతున్న వైఎస్ జగన్ ప్రజాసంకల్ప యాత్ర, మరో నాలుగైదు రోజుల్లో ముగియనుంది. ఈ నేపథ్యంలో శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురంలో నిర్వహించనున్న ముగింపు సభ ఎలా ఉండాలన్న విషయమై నేడు కీలక సమావేశం జరగనుంది. ఈ విషయాన్ని వెల్లడించిన శ్రీకాకుళం పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు తమ్మినేని సీతారాం, ఈ సమావేశానికి 10 నియోజకవర్గాల సమన్వయకర్తలు, పార్లమెంట్‌ నియోజకవర్గ సమన్వయకర్తలతో పాటు మండల అధ్యక్షులు, అనుబంధ సంస్థల ప్రతినిధులు, వివిధ స్థాయి నాయకులు హాజరవుతారని తెలిపారు. ప్రజాసంకల్ప యాత్ర 9వ తేదీతో ముగుస్తుందని, సభ ఏర్పాట్లపై చర్చించిన తరువాత మరిన్ని విషయాలను తెలియజేస్తామని ఆయన అన్నారు. ఈ సభకు అధిక సంఖ్యలో పార్టీ అభిమానులు, ప్రజలు హాజరు కావాలని కోరారు.
YSRCP
Tammineni Seetaram
Padayatra
Jagan

More Telugu News