Chandrababu: ఏ రాష్ట్రం ఆనందంగా ఉన్నా మోదీకి నిద్ర పట్టదు: చంద్రబాబు

  • న్యాయ పోరాటం చేస్తాం
  • రూ.75 వేల కోట్ల నిధులు రావాలి
  • మరో 30 ఏళ్లు పడుతుంది
ఏ రాష్ట్రం ఆనందంగా ఉన్నా ప్రధాని మోదీకి నిద్రపట్టదని.. ప్రశాంతంగా ఉన్న కేరళలో చిచ్చు పెట్టారని ఏపీ సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ వేసిన ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ ద్వారా రాష్ట్రానికి రూ.75 వేల కోట్ల నిధులు రావాలని తేల్చారన్నారు.

ఏపీ గడ్డపై ఉన్న ప్రతి ఒక్కరూ కేంద్రంపై పోరాడాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. ఓపక్క పోలవరానికి అవార్డు ఇచ్చి.. మరోపక్క తమనే తిడుతున్నారని పేర్కొన్నారు. నరేగా నిధుల విషయంలో తాము న్యాయ పోరాటం చేస్తామన్నారు. ఇలాగే నిధులు ఇస్తే కనుక జాతీయ విద్యాసంస్థలు పూర్తి కావడానికి మరో 30 ఏళ్లు పడుతుందని చంద్రబాబు అన్నారు. 
Chandrababu
Narendra Modi
Kerala
Pawan Kalyan
Polavaram

More Telugu News