Andhra Pradesh: ఆంధ్రాలో గోడ గడియారాలు పంచిన వైసీపీ.. లోపల టీఆర్ఎస్ నేతల ఫొటోలు!

  • మదనపల్లెలో పంచిన వైసీపీ నేతలు
  • గడియారాల్లో టీఆర్ఎస్ నేతల ఫొటోలు
  • కేసీఆర్ రిటర్న్ గిఫ్ట్ వ్యాఖ్యలతో సర్వత్రా ఆసక్తి
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో జోక్యం చేసుకున్న టీడీపీ అధినేత చంద్రబాబుకు త్వరలోనే రిటర్న్ గిఫ్ట్ ఇస్తానని తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో ఏపీలో వైసీపీ లేదా జనసేనకు కేసీఆర్ సాయం చేస్తారని వార్తలు అప్పట్లో చక్కర్లు కొట్టాయి. తాజాగా దీన్ని బలపరిచేలా ఓ ఘటన ఆంధ్రప్రదేశ్ లోని చిత్తూరు జిల్లాలో చోటుచేసుకుంది.

త్వరలోనే ఎన్నికలు రానున్న నేపథ్యంలో చిత్తూరు జిల్లా మదనపల్లెలో వైసీపీ నేతలు గోడ గడియారాలను పంచారు. ఇందులో వైఎస్ రాజశేఖరరెుడ్డి, వైసీపీ అధినేత జగన్ తో పాటు పార్లమెంటు సభ్యుడు మిథున్ రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే తిప్పారెడ్డి ఫొటోలు ఉన్నాయి. అయితే గడియారం లోపల ఇంకో స్టిక్కర్ ఉన్నట్లు గుర్తించిన స్థానికులు దాన్ని తొలగించి చూసి షాక్ తిన్నారు.

అందులో టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తో పాటు ఇతర ముఖ్య నేతల ఫొటోలు, కారు గుర్తు దర్శనమిచ్చాయి. దీంతో చిత్తూరు జిల్లాలో ఒక్కసారిగా రాజకీయంగా కలకలం చెలరేగింది. కాగా దీనిపై ఇంకా వైసీపీ, టీడీపీలు స్పందించలేదు.
Andhra Pradesh
Chittoor District
Telugudesam
Chandrababu
YSRCP
Jagan
wall clock
TRS
Telangana

More Telugu News