వేడుకల కాల్పుల్లో తూటాలు తగిలి మహిళ మృతి

షార్ట్స్‌లో చూడండి
నూతన సంవత్సరం సందర్భంగా ఢిల్లీలో ఏర్పాటు చేసిన ఓ వేడుకలో బీహార్ కు చెందిన బీజేపీ నేత, మాజీ జేడీయూ ఎమ్మెల్యే రాజ్ కుమార్ సింగ్ జరిపిన వేడుక కాల్పుల్లో ఓ మహిళ మృతి చెందింది. వేడుకలలో భాగంగా రాజ్ కుమార్ సింగ్ గాల్లోకి కాల్పులు జరిపాడని, ఈ కాల్పులలో అర్చన గుప్తా (42)కు తూటాలు తగలడంతో ఆమె తీవ్రంగా గాయపడింది. హుటాహుటిన ఆసుపత్రికి తరలించినా ప్రయోజనం లేకపోయింది. ఈ ఘటనపై ఆమె భర్త వికాస్ గుప్తా పోలీసులకు ఫిర్యాదు చేశారు.  

మరోవైపు, తుపాకీ కాల్పుల వల్లే ఆమె చనిపోయినట్టు సౌత్ జోన్ డీసీపీ విజయ్ కుమార్ తెలిపారు. సంఘటన అనంతరం ఢిల్లీ నుంచి యూపీలోని గోరఖ్ పూర్ కు పారిపోయిన రాజ్ కుమార్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆయన నివాసంలో సోదాలు నిర్వహించి... ఒక తుపాకీ, రెండు రైఫిల్స్, 800 బుల్లెట్లను స్వాధీనం చేసుకున్నారు.
Go Back to Shorts
bjp
leader
fire
women
delhi
new year
gorakhpur

More Telugu News