Andhra Pradesh: అగ్రిగోల్డ్ బాధితులకు ఊరట.. సొంతంగా డబ్బులు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం!

  • అటాచ్ కాని ఆస్తుల కొనుగోలుకు నిర్ణయం
  • రూ.300 కోట్ల మేర నిధుల పంపకానికి ఆమోదం
  • నేడు అగ్రిగోల్డ్ విషయమై ఆందోళనకు దిగిన వైసీపీ
అగ్రిగోల్డ్ బాధితులకు ఊరట ఇచ్చేలా ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ కేసులో విచారణ సంస్థలు జప్తు చేయని ఆస్తులను కొనుగోలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. రాబోయే నెల రోజుల్లో రూ.300 కోట్ల విలువైన ఆస్తుల కొనుగోలుకు అంగీకరించింది.

తొలి విడతలో భాగంగా రూ.5,000 మేరకు అగ్రిగోల్డ్ డిపాజిటర్లకు నగదును చెల్లిస్తామని పేర్కొంది. ఈ విషయంలో అగ్రిగోల్డ్ బాధిత సంఘంతో కలిసి హైకోర్టులో ఉమ్మడి అఫిడవిట్ దాఖలు చేస్తామని చెప్పింది. అగ్రిగోల్డ్ వ్యవహారంలో వైసీపీ ఈరోజు ఏపీ అంతటా జిల్లా కలెక్టరేట్ల ముందు ఆందోళనకు దిగిన నేపథ్యంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోవడం గమనార్హం.
Andhra Pradesh
agri gold
Telugudesam
assets purchase

More Telugu News