Mahesh Babu: మహేశ్ తదుపరి సినిమా సుకుమార్ తో .. హీరోయిన్ గా కత్రినా కైఫ్?

షార్ట్స్‌లో చూడండి
మహేశ్ బాబు అభిమానుల దృష్టి ఆయన 25వ సినిమా అయిన 'మహర్షి'పైనే వుంది. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతోంది. ఇప్పటికే చాలా వరకూ చిత్రీకరణ జరుపుకున్న ఈ సినిమా, ఏప్రిల్ 5వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ఆయన తరువాత సినిమాకి సంబంధించిన సన్నాహాలు జరిగిపోతున్నాయి.

మహేశ్ 26వ సినిమా సుకుమార్ తో ఉండనుంది. సాధ్యమైనంత త్వరగా ఈ ప్రాజెక్టును పట్టాలెక్కించడానికి సుకుమార్ తనవంతు ప్రయత్నాలు చేస్తున్నాడు. ఈ సినిమాలో కథానాయికగా కత్రినా కైఫ్ ను తీసుకునే ఆలోచనలో టీమ్ ఉందట. ప్రస్తుతం ఆ దిశగా ప్రయత్నాలు జరుగుతున్నట్టుగా తెలుస్తోంది. కెరియర్ ఆరంభంలో కత్రినా ఇక్కడ 'మల్లీశ్వరి'తో హిట్ కొట్టింది. ఆ తరువాత  బాలకృష్ణతో 'అల్లరి పిడుగు' చేసిన ఆమె, హిందీలో స్టార్ హీరోయిన్ గా బిజీ అయింది. మహేశ్ మూవీ కోసం మళ్లీ ఆమెను టాలీవుడ్ కి తెచ్చే ప్రయత్నాల్లో సుకుమార్ బిజీగా వున్నాడని అంటున్నారు. అదే నిజమైతే కత్రినా ఏమంటుందో చూడాలి మరి. 
Go Back to Shorts
Mahesh Babu
katrina

More Telugu News