Nokia 106 (2018): నోకియా 106 (2018) ఫీచర్ ఫోన్ విడుదల.. డిస్కౌంట్ ఆఫర్లు ప్రకటించిన యాక్సిస్, హెచ్.డీ.ఎఫ్.సీ

షార్ట్స్‌లో చూడండి
హెచ్.ఎం.డీ గ్లోబల్ సంస్థ నోకియా తాజాగా తన నూతన ఫీచర్ ఫోన్ 'నోకియా 106 (2018)' ని భారత మార్కెట్లో విడుదల చేసింది. రూ.1299 ధరకి లభించే ఈ ఫోన్ ఆఫ్ లైన్, ఆన్ లైన్ స్టోర్లలో వినియోగదారులకి అందుబాటులో ఉండనుంది. డార్క్ గ్రే కలర్ ఆప్షన్ లో లభించే ఈ ఫోన్ పై ఫ్లిప్ కార్ట్, అమెజాన్ సంస్థలు పలు డిస్కౌంట్ ఆఫర్లని ప్రకటించాయి.

వినియోగదారులకి యాక్సిస్ బ్యాంకు కార్డుల ద్వారా ఫ్లిప్ కార్ట్ సంస్థ 10 శాతం డిస్కౌంట్ ఇస్తుండగా, హెచ్.డీ.ఎఫ్.సీ కార్డులపై అమెజాన్ సంస్థ 5 శాతం డిస్కౌంట్ ఇవ్వనుంది. 1.8" డిస్ప్లే (160 x 120 రిజల్యూషన్), 4 ఎంబీ ర్యామ్, 4 ఎంబీ ఇంటర్నల్ స్టోరేజ్ తో పాటు దీనిలో 800 ఎంఏహెచ్ బ్యాటరీ లాంటి పలు ఫీచర్లు ఉన్నాయి.
Go Back to Shorts
Nokia 106 (2018)
నోకియా
nokia
smartphone
Tech-News
technology

More Telugu News