Tollywood: మా అమ్మ నాపై కోపంగా ఉంది.. హగ్ ఇచ్చి కూల్ చేస్తా!: విజయ్ దేవరకొండ

  • నెలన్నరగా ఇంటికి పోలేదు
  • మన లైఫ్ లో ఎక్కువగా ఉండేది అమ్మానాన్నలే
  • 2019 నుంచి వాళ్లకు ఐలవ్యూ చెబుదాం
టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ ప్రస్తుతం డియర్ కామ్రేడ్ షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. దీంతో దాదాపు నెలన్నర కాలంలో విజయ్ ఇంటికి వెళ్లలేకపోయాడు. ఈ నేపథ్యంలో అభిమానులకు క్రిస్మస్, నూతన సంవత్సర విషెస్ చెప్పేందుకు ముందుకు వచ్చాడు. ఈ సందర్భంగా తన రౌడీ అభిమానులకు సర్ ప్రైజ్ గిఫ్ట్ ఇస్తానని ప్రకటించాడు. ఈ మేరకు విజయ్ ఈరోజు సోషల్ మీడియాలో ఓ వీడియోను పోస్ట్ చేశాడు.

‘మా అమ్మ నాపై కోపంగా ఉంది. షూటింగులు, ఇంటర్వ్యూల నేపథ్యంలో నేను దాదాపు నెలన్నర పాటు ఇంటికి రాలేదు. కాకినాడలో షూటింగ్‌ చేస్తూ బిజీగా ఉన్నాను. ఇక్కడకు వచ్చిన తర్వాత డబ్బింగ్‌, ఇంటర్వ్యూ, న్యూ ఇయర్‌ సెలబ్రేషన్స్‌తో కొంత బిజీగా ఉన్నాను. అందుకే అమ్మానాన్నలను కలవకలేకపోయాను. మనం మన అమ్మానాన్నలకు ఐ లవ్యూ అని గట్టిగా చెప్పం.

మన లైఫ్‌లో ఎక్కువగా ఉండేది వాళ్లే. అయితే ఈ కొత్త సంవత్సరం నుంచి మనం మన అమ్మానాన్నలకు ఐ లవ్యూ చెబుదాం. ఇప్పుడు మా అమ్మకు ఐ లవ్యూ చెప్పి హగ్‌ ఇచ్చి కూల్‌ చేస్తా.. ఆ వీడియోను షూట్‌ చేస్తా. మీరు కూడా మీ అమ్మానాన్నలకు ఐ లవ్యూ చెప్పి హగ్‌ ఇచ్చిన వీడియోలను #deverasanta అనే హ్యాష్‌ట్యాగ్‌తో పోస్ట్‌చేయండి. మీకు ఓ సర్‌ప్రైజ్‌ గిఫ్ట్ ఇస్తా’ అంటూ దేవరకొండ ఓ వీడియోను పోస్ట్ చేశాడు.
Tollywood
vijay devarakonda
video
mother
i love you
Social Media

More Telugu News