mamatha banerjee: చర్చనీయాంశంగా మారిన మమతా బెనర్జీ మేనల్లుడి వ్యాఖ్యలు

  • తమ ప్రధాని అభ్యర్థి మమతానే అని తెలిపిన ఆమె మేనల్లుడు అభిషేక్
  • మమతతో అన్ని పార్టీలు కలసి రావాలని విన్నపం 
  • పెను మార్పులు తీసుకొచ్చే ఏడాదిగా 2019 నిలవాలి
రానున్న పార్లమెంటు ఎన్నికల్లో అధికారాన్ని నిలబెట్టుకునేందుకు ఎన్డీయే, బీజేపీని ఓడించేందుకు మహాకూటమి... బీజేపీ, కాంగ్రెసేతర ప్రభుత్వ ఏర్పాటు కోసం ఫెడరల్ ఫ్రంట్... ఇలా ఎన్నో సమీకరణలు తెరపైకి వస్తున్నాయి. వీటన్నింటి నేపథ్యంలో, టీఎంసీ ఎంపీ, మమతా బెనర్జీ మేనల్లుడు అభిషేక్ బెనర్జీ కీలక వ్యాఖ్యలు చేశారు.

సార్వత్రిక ఎన్నికల్లో తమ ప్రధాని అభ్యర్థిగా మమతా బెనర్జీనే ఉంటారని ఆయన తేల్చి చెప్పారు. ప్రగతిశీల, లౌకిక భారతావని నిర్మాణం కోసం అన్ని పార్టీలు మమతతో కలసి రావాలని ఆయన విన్నవించారు. దేశంలో పెను మార్పులు తీసుకొచ్చే ఏడాదిగా 2019 నిలవాలని అన్నారు. ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. 
mamatha banerjee
trinamool congress
abhishek banerjee

More Telugu News