Odisha: ఒడిశాలో నాటు పడవ ప్రమాదం.. 9 మంది మృతి

  • హక్కీటోలాకు వెళుతుండగా నిప్పానియా వద్ద బోల్తా
  • ప్రమాద సమయానికి పడవలో 55 మంది ప్రయాణికులు
  • మృతుల కుటుంబాలకు రూ.4 లక్షల చొప్పున పరిహారం 
ఒడిశా రాష్ట్రంలోని కేంద్రపారా జిల్లా పరిధిలో నాటు పడవ బోల్తాపడిన ఘటనలో తొమ్మిది మంది చనిపోయారు. మరొకరి జాడ తెలియడం లేదు. పర్యాటక ప్రాంతం హక్కీటోలాకు 55 మంది ప్రయాణికులతో పడవ వెళుతుండగా నిప్పానియా వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. ఓవర్‌ లోడ్‌ కారణంగానే బోటు బోల్తాపడినట్లు భావిస్తున్నారు.

చనిపోయిన వారిలో ఏడుగురు చిన్నారులు, ఇద్దరు మహిళలు ఉన్నారు. మృతులంతా జగత్‌సింగ్‌పూర్‌ జిల్లా కుజంగ వాసులుగా పోలీసులు గుర్తించారు. ఒడిశా ప్రభుత్వం తక్షణ సాయం కోసం ఆదేశించింది. సహాయకులు గల్లంతైన వ్యక్తి కోసం గాలిస్తున్నారు. చనిపోయిన వారి కుటుంబాలకు 4 లక్షల రూపాయలు చొప్పున నష్టపరిహారం చెల్లించనున్నట్లు ఒడిశా ముఖ్యమంత్రి నవీన్‌పట్నాయక్‌ ప్రకటించారు.
Odisha
boat accident
9 died

More Telugu News