Flight: ఆ విమానంలో ఒకే ప్రయాణికురాలు!

  • ఫిలిప్పీన్స్ ఎయిర్ లైన్స్ విమానంలో ఘటన
  • విమానంలో ఒకే ప్రయాణికురాలిగా లూసియా ఎరిస్పే
  • వైరల్ అవుతున్న ఫోటోలు
ఓ విమానంలో ఒంటరిగా ప్రయాణిస్తే... బాగా డబ్బుండి చార్టెడ్ విమానాన్ని అద్దెకు తీసుకుని వెళ్లగలిగిన వారైతే ఇది సాధ్యమే. కానీ, మామూలు ప్యాసింజర్ విమానంలో ఇది జరగాలంటే... అసలు ఊహకే అందదుకదా? ఫిలిప్పీన్స్‌ కు చెందిన లూసియా ఎరిస్పే ఈ కలను సాకారం చేసుకుంది. అసలు విషయాన్ని, తనకు ఎదురైన అనుభవాన్ని సోషల్ మీడియాలో పంచుకుంది.

లూసియా ఎరిస్పే, దావో నుంచి మనిలా వెళ్లేందుకు టికెట్ బుక్ చేసుకుంది. ఫిలిప్పీన్స్ ఎయిర్‌ లైన్స్ పీఆర్ 2820 అనే విమానం కోసం ఎదురుచూసి, విమానం రాగానే, లోపలికి ఎక్కింది. చుట్టూ ఎవరూ లేరు. ప్రయాణం చేస్తున్నది తాను ఒక్కర్తినేనని తెలుసుకుని ఆమె ఆశ్చర్యపోయింది. విమానం సిబ్బందితో సెల్ఫీలు దిగింది. ఆ ఫోటోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. కాగా, గతంలో కరోన్ గ్రీవ్ అనే మహిళ కూడా ఇలానే విమానంలో ఒంటరిగా ప్రయాణించిన అనుభూతిని మిగుల్చుకుంది.
Flight
Phileppines
Lady
Passenger

More Telugu News