Pawan kalyan: చంద్రబాబు వ్యాఖ్యలను సీరియస్‌గా తీసుకోవాల్సిన అవసరం లేదనే అభిప్రాయంలో జనసేనాని?

  • చంద్రబాబు వ్యాఖ్యలపై పవన్ మౌనం
  • పవన్ స్పందన కోసం ఎదురు చూస్తున్న నేతలు
  • సరైన సమయంలో స్పందిస్తారు
వచ్చే ఎన్నికల్లో జనసేనతో కలిసి పోటీ చేస్తే తప్పేంటంటూ ఏపీ సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. దీనిపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ మౌనం వహించారు. చంద్రబాబు వ్యాఖ్యలను సీరియస్‌గా తీసుకోవాల్సిన అవసరం లేదనే అభిప్రాయంతో జనసేనాని ఉన్నట్టు సమాచారం.

అయితే ఆ పార్టీ నేతలంతా పవన్ ఏమంటారోనని ఎదురు చూస్తున్నారు. పవన్‌ సన్నిహితులు మాత్రం ఆయన సరైన సమయంలో స్పందిస్తారని చెబుతున్నారు. అయితే జనసేన సోషల్ మీడియా విభాగం మాత్రం ‘అంతా జనసేనతో పొత్తు కోరుతున్నారు. కానీ జనసేన ఎవరితో పొత్తు పెట్టుకోదు అనేది ముఖ్యం’ అని తెలిపింది.
Pawan kalyan
Chandrababu
Andhra Pradesh
Social Media
Janasena

More Telugu News