Jana Sena: జనసేనతో టీడీపీ పొత్తు వార్తలపై పవన్ పాత ట్వీట్‌ వైరల్!

షార్ట్స్‌లో చూడండి
ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నిన్న జనసేనతో కలిసి ఎన్నికలకు వెళితే జగన్ కి వచ్చిన నొప్పేంటని చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో కలకలం సృష్టిస్తున్నాయి. జనసేన, టీడీపీ కలిసి ఎన్నికలలో పోటీ చేస్తాయని వస్తున్న వార్తల నేపథ్యంలో పవన్ కల్యాణ్ మూడు నెలల క్రితం చేసిన ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. చంద్రబాబు చేసిన వ్యాఖ్యల పట్ల పవన్ స్పందించారని వివిధ సామాజిక మాధ్యమాల్లో తెగ చక్కర్లు కొడుతోంది.

''అదిగో పులి అంటే ఇదిగో తోక అన్నట్టు.. జనసేన, ఆ పార్టీతో కలుస్తుంది, ఈ పార్టీతో కలుస్తుందని కొందరు అంటే, కలవడం ఏంటి? సీట్ల సర్దుబాటు కూడా అయిపోయిందని ఇంకొందరు అంటున్నారు. మనకు ఏ పార్టీ అండా దండా అక్కర్లేదు..' మన బలం జనం చూపిద్దాం ప్రభంజనం' అంటూ పవన్ మూడు నెలల క్రితం ట్వీట్ చేశారు.
Go Back to Shorts
Jana Sena
Telugudesam
Andhra Pradesh
Pawan Kalyan
Chandrababu

More Telugu News