Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవంపై చంద్రబాబు ఆవేదన

  • కేంద్రం సహకరించకున్నా అభివృద్ధి
  • పోలవరంలో 63 శాతం పనులు పూర్తి
  • రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేశాం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవంపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. బుధవారం కుప్పం నియోజకవర్గంలో పర్యటించిన చంద్రబాబు వడ్డేపల్లిలో ఎన్టీఆర్ గృహాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. దేశంలో రాష్ట్రావతరణ దినోత్సవాన్ని జరుపుకోలేని ఏకైక రాష్ట్రం మనదేనని ఆవేదన వ్యక్తం చేశారు.

 కేంద్రం సహకరించకపోయినా రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తున్నట్టు చెప్పారు. పోలవరం ప్రాజెక్టు విషయంలో కేంద్రంతో పోరాడుతున్నామని, ఇప్పటికే 63 శాతం పూర్తయిందని చెప్పుకొచ్చారు. అధికారంలోకి వచ్చిన నాలుగున్నరేళ్లలో రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేసినట్టు తెలిపారు. ప్రజలకు ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేరుస్తున్నట్టు సీఎం వివరించారు.
Andhra Pradesh
Kuppam
Chandrababu
Polavaram
Narendra Modi
BJP

More Telugu News