సినీ నటుడు ప్రభాస్ దరఖాస్తును ఎందుకు తిరస్కరించారు?: ప్రభుత్వానికి హైకోర్టు సూటి ప్రశ్న
- రాయదుర్గంలోని ప్రభాస్ గెస్ట్‌హౌస్ సీజ్
- హైకోర్టును ఆశ్రయించిన నటుడు
- పూర్తి వివరాలను రేపు సమర్పిస్తామన్న ప్రభుత్వం
రాయదుర్గంలోని తన గెస్ట్‌హౌస్‌ను రెవెన్యూ అధికారులు సీజ్ చేయడాన్ని సవాలు చేస్తూ ప్రభాస్ హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌ను స్వీకరించిన ధర్మాసనం ఈ మేరకు అధికారులను ప్రశ్నించింది. పూర్తి వివరాలను గురువారం కోర్టు ముందు ఉంచుతామని చెప్పడంతో కేసును రేపటికి వాయిదా వేసింది.