Prabhas: సినీ నటుడు ప్రభాస్ దరఖాస్తును ఎందుకు తిరస్కరించారు?: ప్రభుత్వానికి హైకోర్టు సూటి ప్రశ్న

  • రాయదుర్గంలోని ప్రభాస్ గెస్ట్‌హౌస్ సీజ్
  • హైకోర్టును ఆశ్రయించిన నటుడు
  • పూర్తి వివరాలను రేపు సమర్పిస్తామన్న ప్రభుత్వం
ప్రముఖ సినీ నటుడు ప్రభాస్ గెస్ట్ హౌస్ సీజ్ వ్యవహారంలో రెవెన్యూ అధికారులకు హైకోర్టు మొట్టికాయలు వేసింది. ప్రభాస్ పెట్టుకున్న రెగ్యులరైజేషన్ దరఖాస్తును పరిశీలనలోకి ఎందుకు తీసుకోలేదని ప్రశ్నించింది. రెగ్యులరైజేషన్‌ను తిరస్కరించినట్టు ఉత్తర్వులు ఉన్నాయా? అని అధికారులను ప్రశ్నించింది. దీంతో స్పందించిన ప్రభుత్వం తరపు న్యాయవాది పూర్తి వివరాలను రేపు కోర్టు ముందు ఉంచుతామని చెప్పారు.

రాయదుర్గంలోని తన గెస్ట్‌హౌస్‌ను రెవెన్యూ అధికారులు సీజ్ చేయడాన్ని సవాలు చేస్తూ ప్రభాస్ హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌ను స్వీకరించిన ధర్మాసనం ఈ మేరకు అధికారులను ప్రశ్నించింది. పూర్తి వివరాలను గురువారం  కోర్టు ముందు ఉంచుతామని చెప్పడంతో కేసును రేపటికి వాయిదా వేసింది.
Prabhas
Tollywood
Actor
Rayadurgam
Guest house
police
High Court

More Telugu News