ఆద్యంతం గోప్యత... అయ్యప్ప సన్నిధికి మహిళలు ఎలా వచ్చి వెళ్లారంటే..!
- భక్తులకు అనుమానం రాకుండా అంబులెన్స్ లో మహిళలు
- ముందు ఆలయం వద్ద భక్తులు లేకుండా చూసిన అధికారులు
- వారిని వెన్నంటే వచ్చిన ఓ కెమెరా
ఆపై వీరు 18 బంగారు మెట్లపై నుంచి ఎక్కి, పరిగెత్తుతూ ఆలయంలోకి వెళుతుంటే, వెనుకే ఓ కెమెరా వీరిని అనుసరించింది. ఆ కెమెరా చిత్రీకరించిన దృశ్యాలే ఇప్పుడు బయటకు వచ్చాయి. స్వామి దర్శనం అనంతరం వీరిని అంతే వేగంగా కొండ కిందకు దింపి, ప్రత్యేక వాహనంలో నీలక్కల్ దాటించినట్టు తెలుస్తోంది. వీరిద్దరూ ఇప్పుడు ఎక్కడ ఉన్నారన్న విషయమై సమాచారం లేదు. ఇక ఈ ఘటనపై తీవ్రంగా స్పందించిన కేరళ బీజేపీ నేత రమేష్, శబరిమలలోని అన్ని సీసీటీవీ ఫుటేజ్ లనూ బయటపెట్టాలని డిమాండ్ చేశారు. వీరు భక్తుల కంటబడకుండా కొండపైకి వచ్చారంటే, అది ప్రభుత్వ కుట్రేనని, తాము రాష్ట్రవ్యాప్త నిరసనలు చేపడతామని హెచ్చరించారు.