Vijayasai Reddy: చంద్రబాబుకు సరిగ్గా నప్పే పేరు ఇదే!: విజయసాయిరెడ్డి సెటైర్

  • పవన్ తో పొత్తుకు వెంపర్లాడుతున్న చంద్రబాబు
  • నారా పవన్ రాహుల్ నాయుడు అని పిలుచుకోవచ్చు
  • ఒక్క హామీ కూడా అమలు చేయలేదన్న విజయసాయి 
చంద్రబాబు మళ్లీ పవన్ కల్యాణ్ తో పొత్తుకు వెంపర్లాడుతున్నారని, ఇకపై ఆయనను నారా పవన్ రాహుల్ నాయుడు అని పిలుచుకుంటే సరిగ్గా సరిపోతుందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. గతంలో పవన్ ను ఓ మారు పెళ్లి చేసుకుని, ఆపై విడాకులు ఇచ్చి, ఇప్పుడు మళ్లీ దగ్గర కావడానికి ఆయన ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు.

 ఈ ఉదయం పార్లమెంట్ సమావేశాల్లో పాల్గొనేందుకు వచ్చిన ఆయన, గాంధీ విగ్రహం ముందు నిరసన తెలిపారు. చంద్రబాబు 600 హామీలు ఇచ్చారని, వాటిల్లో ఒక్కదాన్ని కూడా పూర్తిగా అమలు చేయలేదని, కేవలం శంకుస్థాపనలకే ఆయన పరిమితమని విమర్శలు గుప్పించారు. జనసేన పార్టీలో టీడీపీ కోవర్టులు ఉన్నారని, వారు పవన్ కల్యాణ్ ను తప్పుదారి పట్టిస్తున్నారని నిప్పులు చెరిగిన విజయసాయి, నవ్యాంధ్రలో కోర్టును ఏర్పాటు చేయడం చంద్రబాబుకు ఇష్టం లేదని ఆరోపించారు. ఈ సందర్భంగా ఆయన రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్ చేశారు.
Vijayasai Reddy
Chandrababu
Pawan Kalyan
Rajya Sabha

More Telugu News