Chandrababu: కుప్పం నియోజక వర్గంలోని గ్రామంలో నేడు చంద్రబాబు పాదయాత్ర!

  • కుప్పం చేరుకున్న చంద్రబాబు
  • వడ్డేపల్లిలో పాదయాత్ర చేయనున్న సీఎం
  • పేదల గృహ సముదాయానికి ప్రారంభోత్సవం 
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేడు పాదయాత్రను చేయనున్నారు. ఇప్పటికే తన సొంత నియోజకవర్గమైన చిత్తూరు జిల్లా కుప్పంకు చేరుకున్న ఆయన, రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న ఆరో విడత 'జన్మభూమి - మా ఊరు' కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు.

 ఆపై వడ్డేపల్లి గ్రామంలో పాదయాత్ర చేసి, ప్రజల సమస్యలను తెలుసుకోనున్నారు. అక్కడ పేదలకు నిర్మించిన గృహ సముదాయాన్ని ప్రారంభించి, లబ్ధిదారులకు వాటిని అందిస్తారు. ఆపై హార్టికల్చర్ హబ్ సెంటర్ ఫర్ ఎక్సలెన్స్ ను చంద్రబాబు ప్రారంభిస్తారు. అనంతరం పోలీస్‌ హౌస్‌‌ ను సందర్శించి, ఆపై రైతులతో ముఖాముఖి నిర్వహిస్తారు.
Chandrababu
Kuppam
Chittoor District
Padayatra
Vaddepalli

More Telugu News