Chandrababu: ఏపీపై పగబట్టిన కేసీఆర్: చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు

  • మోదీకి తోడుగా నిలిచిన కేసీఆర్, జగన్
  • ప్రజలు నిలదీస్తారనే ఏపీకి రాని మోదీ
  • టెలీ కాన్ఫరెన్స్ లో చంద్రబాబు
ఏపీ అభివృద్ధిని ప్రధాని నరేంద్ర మోదీ అడుగడుగునా అడ్డుకుంటుంటే, ఆయనకు తోడుగా వైఎస్ జగన్ నిలబడ్డారని ఆరోపించారు. ఈ ఉదయం టీడీపీ నాయకులతో టెలీ కాన్ఫరెన్స్ లో మాట్లాడిన ఆయన పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీ ప్రజలు ఎక్కడ నిలదీస్తారోనన్న భయంతోనే ప్రధాని తన ఏపీ పర్యటనను రద్దు చేసుకున్నారని అభిప్రాయపడ్డ చంద్రబాబు, రాష్ట్రంపై ఆయనతో పాటు కేసీఆర్ కూడా పగబట్టారని సంచలన వ్యాఖ్యలు చేశారు.

అభివృద్ధి నిరోధకులను అడ్డుకోవాల్సింది ప్రజలేనని అన్నారు. తెలుగు రాష్ట్రాల ప్రజలు అభివృద్ధిలో పరుగులు పెట్టాలంటే, ఏపీ, తెలంగాణలు సఖ్యతతో ఉండాలని, కానీ, కేసీఆర్ అందుకు సుముఖంగా లేరని అన్నారు. ప్రస్తుతం తాను ముగ్గురు మోదీలతో పోరాడుతున్నానని, ప్రజల అండ లేకుంటే తాను విజయం సాధించడం క్లిష్టమవుతుందని వ్యాఖ్యానించారు. రానున్న ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా కార్యకర్తలు కృషి చేయాలని అన్నారు.
Chandrababu
Narendra Modi
KCR
Jagan
Andhra Pradesh
Telangana

More Telugu News