Jagan: వైఎస్ జగన్ ను కలిసిన తెలంగాణ నేతలు!

  • ప్రస్తుతం శ్రీకాకుళం జిల్లాలో పాదయాత్ర
  • కలిసిని భూపాలపల్లి, వరంగల్ జిల్లా అధ్యక్షులు
  • జగన్ ను ప్రజలు సీఎంగా చూడాలని అనుకుంటున్నారని వ్యాఖ్య
ప్రస్తుతం శ్రీకాకుళం జిల్లాలో పాదయాత్ర చేస్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ ను ఆ పార్టీకి చెందిన కొందరు తెలంగాణ నేతలు కలుసుకున్నారు. భూపాలపల్లి జిల్లా అధ్యక్షుడు అప్పం కిషన్‌, వరంగల్‌ జిల్లా అధ్యక్షుడు శాంతికుమార్‌ తదితరులు పాదయాత్రలో పాల్గొని, జగన్ కు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఆపై వారు మీడియాతో మాట్లాడుతూ, ఏపీ ప్రజలు రానున్న ఎన్నికల్లో వైసీపీని గెలిపించాలన్న నిర్ణయంలో ఉన్నారని, జగన్‌ ను సీఎంగా చూడాలనుకుంటున్నారని అన్నారు. మరో నాలుగు నెలల్లో జరిగే ఎలక్షన్స్ లో వైకాపా విజయం ఖాయమన్నారు. జగన్‌ ను కలుసుకున్న వారిలో వైసీపీ నేతలు రమేష్‌, మహేందర్‌, రాజు, కిరణ్‌ తదితరులు ఉన్నారు.
Jagan
Telangana
YSRCP
Padayatra

More Telugu News