Kamal Haasan: 'భారతీయుడు 2' రెగ్యులర్ షూటింగ్ కి డేట్ ఫిక్స్

షార్ట్స్‌లో చూడండి
కమలహాసన్ కథానాయకుడిగా శంకర్ గతంలో తెరకెక్కించిన 'భారతీయుడు' సంచలన విజయాన్ని నమోదు చేసింది. ఆ సినిమాకి సీక్వెల్ చేయడానికి శంకర్ రంగంలోకి దిగాడు. 'భారతీయుడు 2' అనే టైటిల్ ను కూడా ఖరారు చేసుకుని, ఇటీవల పూజా కార్యక్రమాలను నిర్వహించారు. చెన్నై .. పొల్లాచ్చి .. యూరప్ లలో ఎక్కువభాగం చిత్రీకరణ జరపనున్నట్టు చెప్పారు.

అప్పటి నుంచి రెగ్యులర్ షూటింగ్ ఎప్పుడు మొదలవుతుందా అని కమల్ అభిమానులు ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమా రెగ్యులర్ షూటింగుకి ముహూర్తం కుదిరింది. ఈ నెల 18 నుంచి పొల్లాచ్చిలో ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలుకానుంది. లైకా ప్రొడక్షన్స్ వారు నిర్మిస్తోన్న ఈ సినిమాలో కమల్ సరసన కాజల్ కథానాయికగా నటించనుంది. దుల్కర్ సల్మాన్ .. శింబు ఈ సినిమాలో ముఖ్యమైన పాత్రలను చేయనున్నారు. ఈ సినిమాకి అనిరుధ్ సంగీతాన్ని అందిస్తోన్న సంగతి తెలిసిందే. 
Go Back to Shorts
Kamal Haasan
kajal

More Telugu News