kcr: కేసీఆర్ ‘ఫ్రంట్’పై అడిగిన ప్రశ్నకు ప్రధాని మోదీ ఆసక్తికర వ్యాఖ్యలు!

  • కేసీఆర్ ‘ఫ్రంట్’ గురించి నాకు తెలియదు
  • తెలంగాణపై చంద్రబాబు ద్వేషంతో ఉన్నారు 
  • అందుకే, కూటమి కట్టి కంగుతిన్నారు
ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు చేస్తానని తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రకటించడం, ఈ క్రమంలో ఒడిశా, పశ్చిమబెంగాల్, ఢిల్లీలో ఇటీవల ఆయన పర్యటించడం తెలిసిందే. ఈ నేపథ్యంలో కేసీఆర్ ‘ఫ్రంట్’ ఏర్పాటు విషయమై ప్రధాని నరేంద్ర మోదీని ప్రశ్నించగా ఆసక్తికర సమాధానం చెప్పారు.

ఏఎన్ఐ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మోదీ మాట్లాడుతూ, కేసీఆర్ ‘ఫ్రంట్’ ఏర్పాటు చేస్తున్నారన్న విషయం తనకు తెలియదని చెప్పారు. మోదీ కోసమే కేసీఆర్ ఈ ఫ్రంట్ ను ఏర్పాటు చేస్తున్నారని చంద్రబాబు చేసిన విమర్శలపై  ప్రశ్నించగా.. తెలంగాణపై ద్వేషంతో ఉన్న చంద్రబాబు రాజకీయాలు చేయాలనుకుని, అక్కడి ఎన్నికల్లో కూటమి కట్టి కంగుతిన్నారని, అందువల్లే, చంద్రబాబు ఏదేదో మాట్లాడుతున్నారని విమర్శించారు. 
kcr
Telangana
Chandrababu
modi
prajakutami

More Telugu News