Ap high court bhavan: చరిత్ర తిరగరాయడానికి మనందరం ఉన్నాం: సీఎం చంద్రబాబు

  • సీఎం క్యాంపు కార్యాలయంలో హైకోర్టు భవనం ప్రారంభం
  • ఇవాళ చాలా ఆనందంగా ఉంది
  • మనందరం కలిసి ఉత్తమ హైకోర్టుగా తీర్చిదిద్దుదాం
సీఎం క్యాంపు కార్యాలయంలో హైకోర్టు భవనాన్ని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కలిసి ప్రారంభించారు. అనంతరం, చంద్రబాబు మాట్లాడుతూ, ఇవాళ చాలా ఆనందంగా ఉందని, చరిత్ర తిరగరాయడానికి మనందరం ఉన్నామని అన్నారు. ఇక్కడి నుంచే న్యాయపరిపాలనకు శ్రీకారం చుట్టామని, మనందరం కలిసి ఉత్తమ హైకోర్టుగా తీర్చిదిద్దుదామని కోరారు. త్వరలోనే అమరావతిలో హైకోర్టు భవన నిర్మాణం పూర్తవుతుందని స్పష్టం చేశారు. సంక్షోభాలను అవకాశాలుగా మలచుకుని ముందుకెళ్తున్నామని, ఉత్తమ రాజధాని నిర్మాణానికి అందరం కలసికట్టుగా పనిచేద్దామని పిలుపు నిచ్చారు. ఈ కార్యక్రమంలో మంత్రులు కొల్లు రవీంద్ర, దేవినేని ఉమ, డీజీపీ ఆర్పీ ఠాకూర్ తదితరులు పాల్గొన్నారు. కాగా, ప్రజావేదికలో హైకోర్టు న్యాయమూర్తులకు, సిబ్బందికి చంద్రబాబునాయుడు విందు ఇచ్చారు.   
Ap high court bhavan
justice nv ramana
cm
Chandrababu

More Telugu News