Chandrababu: కొత్త సంవత్సరం తొలి రోజున చంద్రబాబు తొలి సంతకం దేనిపైన అంటే..!

  • సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి రూ. 53.64 కోట్లు విడుదల చేస్తూ తొలి సంతకం
  • హైకోర్టు రాకతో రాష్ట్ర విభజన పూర్తయిందన్న సీఎం
  • సంక్షోభాలను అవకాశాలుగా మలుచుకొని ముందుకెళ్తాం
నూతన సంవత్సరం తొలి రోజున ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు తొలి సంతకం చేశారు. సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి రూ. 53.64 కోట్లు విడుదల చేస్తూ సంతకం చేశారు. 2014 నుంచి ఇప్పటి వరకు ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి మొత్తం రూ. 1,250 కోట్లు విడుదలయ్యాయి.  

మరోవైపు, తాత్కాలిక హైకోర్టు ప్రారంభం సందర్భంగా ఆయన మాట్లాడుతూ, హైకోర్టు రాకతో రాష్ట్ర విభజన పూర్తయిందని చెప్పారు. నిధులు, ఆస్తుల విభజన తప్ప తరలింపులు పూర్తయ్యాయని తెలిపారు.  ఏపీ హైకోర్టును దేశంలోనే అత్యుత్తమంగా తీర్చిదిద్దుతామని చెప్పారు. హైకోర్టు నిర్వహణకు ఇబ్బందులు తలెత్తకుండా చూస్తామని తెలిపారు. సంక్షోభాలను అవకాశాలుగా మలుచుకొని ముందుకెళ్తామని చెప్పారు.
Chandrababu
high court
Telugudesam

More Telugu News