Prabhas: రజనీ సినిమాల తరహాలో ప్రభాస్ 'సాహో'

  • షూటింగు దశలో 'సాహో'
  • హైలైట్ గా నిలవనున్న యాక్షన్ 
  • కావలసినంత కామెడీ     
ప్రభాస్ అభిమానులందరి దృష్టి ఇప్పుడు 'సాహో' పైనే వుంది. భారీ బడ్జెట్ తో హాలీవుడ్ స్థాయిలో ఈ సినిమా నిర్మితమవుతోంది. యాక్షన్ ఎపిసోడ్స్ ఈ సినిమాకి హైలైట్ గా నిలవనున్నాయని తెలుస్తోంది. దాంతో ఈ సినిమాలో కామెడీకి అవకాశం ఉండకపోవచ్చనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అందుకు సమాధానంగా ఒక వార్త బయటికి వచ్చింది.

ఈ సినిమాలో కామెడీ కూడా కావలసినంత ఉంటుందట. అయితే కామెడీకి ప్రత్యేకమైన ట్రాక్ అంటూ ఏమీ ఉండదు. ప్రభాస్ కి సంబంధించిన సన్నివేశాలు .. కామెడీని కలుపుకుని ఉంటాయట. ఒక్క మాటలో చెప్పాలంటే రజనీకాంత్ సినిమాల తరహాలో, యాక్షన్ ను .. కామెడీని హీరోనే చేస్తూ ముందుకు వెళుతుంటాడని అంటున్నారు. అందువలన ఎక్కడా ప్రేక్షకులకు బోర్ అనిపించిందని చెబుతున్నారు. ఈ సినిమా ద్వారా శ్రద్ధా కపూర్ తెలుగు తెరకి కథానాయికగా పరిచయమవుతోన్న సంగతి తెలిసిందే.
Prabhas
shraddha kapoor

More Telugu News