Tamilnadu: తమిళనాట మొదలైన సంక్రాంతి సందడి... జల్లికట్టు పోటీలు ప్రారంభం!

  • అరియలూరు జిల్లాలో ప్రారంభం
  • రేపు విరుద్ నగర్ లో జల్లికట్టు
  • జంతువులను హింసించవద్దన్న ఏడబ్ల్యూబీ చైర్మన్
తమిళనాడులో సంక్రాంతి సందడి కొత్త సంవత్సరం వచ్చిన తొలిరోజే ప్రారంభమైంది. అరియలూరు జిల్లా సాత్తాన్ కుప్పంలో జల్లికట్టు పోటీలు ఘనంగా ప్రారంభమయ్యాయి. సుమారు 60 ఎద్దులు పరుగులు పెడుతుంటే, వాటిని అదుపు చేసేందుకు 300 మంది యువకులు పోటీ పడ్డారు. ఈ పోటీలను తిలకించేందుకు వేలాది మంది తరలిరావడంతో సందడి వాతావరణం నెలకొంది. రేపు విరుద్ నగర్ జిల్లాలో జల్లికట్టు పోటీలు ప్రారంభం కానున్నాయి. కాగా, జల్లికట్టు కారణంగా జంతువులను హింసించరాదని, పండగను ప్రశాంతంగా జరుపుకోవాలని యానిమల్ వెల్ఫేర్ బోర్డ్ ఆఫ్ ఇండియా చైర్మన్ ఎస్పీ గుప్తా వెల్లడించారు. సుప్రీంకోర్టు నిబంధనలను మీరకుండా జల్లికట్టు జరుపుకోవచ్చని అన్నారు.
Tamilnadu
Jalli Kattu
Ariyaluru

More Telugu News