Azharudeen: టీఆర్ఎస్ లోకి అజారుద్దీన్... సికింద్రాబాద్ నుంచి బరిలోకి?

  • ఎంపీ కుమార్తె వివాహంలో టీఆర్ఎస్ పెద్దలతో చర్చలు
  • సికింద్రాబాద్ టికెట్ ఇచ్చేందుకు కేసీఆర్ సుముఖం
  • రాజకీయ భవిష్యత్తు కోసమేనంటున్న సన్నిహితులు
భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్, తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ అజారుద్దీన్, టీఆర్ఎస్ లో చేరబోతున్నట్టు తెలుస్తోంది. ఈ విషయాన్ని అజారుద్దీన్ స్వయంగా చెప్పకపోయినా, ఆయన సన్నిహితులు మాత్రం ఖరారు చేస్తున్నారు. ఇటీవల జరిగిన ఓ ఎంపీ కుమార్తె వివాహంలో టీఆర్ఎస్ పెద్దలతో అజారుద్దీన్ మాట్లాడారని, ఆయనకు సికింద్రాబాద్ ఎంపీ టికెట్ ఇచ్చేందుకు కేసీఆర్ సుముఖంగానే ఉన్నారని సమాచారం.

కాగా, 2009 ఫిబ్రవరిలో కాంగ్రెస్ పార్టీలో చేరిన అజర్, అదే ఏడాది యూపీలోని మొరాదాబాద్ నుంచి లోక్ సభకు ఎన్నికైన సంగతి తెలిసిందే. ఆపై 2014లో ఆయన పోటీ చేయలేదు. గడచిన అసెంబ్లీ ఎన్నికలకు ముందు పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఆయన నియామకం జరిగింది. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోరంగా ఓడిపోవడంతో, అజర్, తన రాజకీయ భవిష్యత్తు కోసం టీఆర్ఎస్ కు దగ్గర కావాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది.
Azharudeen
Secunderabad
TRS
Congress

More Telugu News