dasoj sravan kumar: దాసోజు శ్రవణ్ కు కాంగ్రెస్ జాతీయ అధికార ప్రతినిధి హోదా!

  • అసెంబ్లీ ఎన్నికల్లో ఖైరతాబాద్ నుంచి పోటీ చేసిన శ్రవణ్ 
  • జాతీయ అధికార ప్రతినిధులను ప్రకటించిన అధిష్ఠానం 
  • ప్రస్తుతం టీ-కాంగ్రెస్ అధికార ప్రతినిధిగా వున్న శ్రవణ్ 
ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఖైరతాబాద్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓటమిపాలైన టీ-కాంగ్రెస్ రాష్ట్ర అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ కు పార్టీ పరంగా ప్రమోషన్ లభించింది. జాతీయ అధికార ప్రతినిధిగా ఆయన్ని నియమిస్తూ కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం ప్రకటన చేసింది.

కాంగ్రెస్ పార్టీ జాతీయ అధికార ప్రతినిధులుగా కొత్తగా పది మందిని నియమిస్తూ అధిష్ఠానం నిర్ణయం తీసుకుంది. ఈ పది మందిలో దాసోజు శ్రవణ్ పేరు కూడా ఉంది. ఇకపై కాంగ్రెస్ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి హోదాలో ఆయన కొనసాగనున్నారు. కాగా, కాంగ్రెస్ పార్టీ జాతీయ అధికార ప్రతినిధులుగా వివిధ రాష్ట్రాల నుంచి ఎంపికైన వారిలో రాగిని నాయక్, పవన్ ఖెరా, రాజీవ్ త్యాగి, అఖిలేష్ ప్రతాప్ సింగ్, గౌరవ్ వల్లభ్, జైవీర్ షెర్గిల్, సయ్యద్ నసీర్ హుస్సేన్, హీనా కవరె, సునీల్ అహిరె వున్నారు.  
dasoj sravan kumar
congress
national spokes person

More Telugu News