KCR: ఎన్నికల్లో అధికార దుర్వినియోగంతో డబ్బు వెదజల్లి కేసీఆర్ గెలిచారు: కుంతియా

  • ఈవీఎంల ట్యాంపరింగ్‌పై హైకోర్టుకు వెళతాం
  • కేసుల్లో క్లీన్‌చిట్ కోసమే మోదీకి మద్దతు
  • అధికారులు క్షమాపణ చెప్పారు
తెలంగాణలో ఈవీఎంల ట్యాంపరింగ్‌పై హైకోర్టుకు వెళతామని తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌చార్జి కుంతియా తెలిపారు. నేడు ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కేసుల్లో క్లీన్‌చిట్ కోసమే ప్రధాని నరేంద్ర మోదీకి కేసీఆర్, నవీన్ పట్నాయక్ మద్దతు పలుకుతున్నారని కుంతియా ఆరోపించారు.

ఎన్నికల్లో అధికార దుర్వినియోగంతో డబ్బు వెదజల్లి కేసీఆర్ గెలిచారని కుంతియా విమర్శించారు. ధర్మపురి, ఇబ్రహీంపట్నం, కోదాడలో ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడ్డారని కుంతియా పేర్కొన్నారు. ఓట్ల తొలగింపుపై ఎన్నికల తర్వాత అధికారులు క్షమాపణ చెప్పిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ఎన్నికల్లో టీఆర్ఎస్ అక్రమాలపై కమిటీ ఏర్పాటు చేస్తామని కుంతియా తెలిపారు.
KCR
EVM Tampering
Kunthiya
Narendra Modi
Naveen Patnayak

More Telugu News