janasena: తెలుగు ప్రజలకు కొత్త సంవత్సరం శుభాకాంక్షలు: పవన్ కల్యాణ్

షార్ట్స్‌లో చూడండి
కొత్త సంవత్సరంలోకి అడుగుపెడుతున్న తరుణంలో తెలుగు ప్రజలందరికీ జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ శుభాకాంక్షలు తెలిపారు. కొత్త ఆశలకు ఊపిరిపోస్తూ 2019లోకి ప్రవేశిస్తున్న సందర్భంగా తెలుగు ప్రజలకు తన తరపున, జనసైనికుల తరపున నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నానని అన్నారు. గడచిన ఏడాది అనుభవాలను ప్రేరణగా తీసుకొని నూతన నిర్ణయాలతో ముందడుగు వేద్దామని, ఈ కొత్త సంవత్సరంలో సామాన్యుడే రాజై వెలగాలని, మానవీయ పాలనకు, నవ చరితకు ఇది శ్రీకారం కావాలని ఆకాంక్షిస్తున్నట్టు పవన్ కల్యాణ్ తన ప్రకటనలో పేర్కొన్నారు.
Go Back to Shorts
janasena
Pawan Kalyan
Andhra Pradesh
Telangana

More Telugu News