amaravathi: ప్రత్యేక బస్సుల్లో అమరావతికి బయల్దేరిన ఏపీ హైకోర్టు సిబ్బంది

  • అమరావతికి బయల్దేరిన 900 మంది హైకోర్టు సిబ్బంది
  • రేపు ఉదయం అమరావతి నుంచి హైకోర్టు కార్యకలాపాలు
  • చీఫ్ జస్టిస్ చేత ప్రమాణస్వీకారం చేయించనున్న గవర్నర్
ఇరు తెలుగు రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టు అధ్యాయం నేటితో ముగిసింది. రేపటి నుంచి రెండు రాష్ట్రాలకు వేర్వేరుగా హైకోర్టులు పని చేయనున్నాయి. ఈ నేపథ్యంలో ఏపీ న్యాయవాదులు, సిబ్బందికి తెలంగాణ న్యాయవాదులు, సిబ్బంది ఆత్మీయ వీడ్కోలు సమావేశాన్ని ఏర్పాటు చేశారు. అనంతరం 900 మంది ఏపీ హైకోర్టు సిబ్బంది ప్రత్యేక బస్సుల్లో అమరావతికి తరలి వెళ్లారు. ఈ సందర్భంగా ఉమ్మడి హైకోర్టు ఆవరణలో తీవ్ర భావోద్వేగం నెలకొంది. రేపు ఉదయం అమరావతి నుంచి ఏపీ హైకోర్టు కార్యకలాపాలను ప్రారంభించనుంది. ఏపీ చీఫ్ జస్టిస్ చేత గవర్నర్ నరసింహన్ ప్రమాణస్వీకారం చేయించనున్నారు.
amaravathi
high court
Andhra Pradesh
staff

More Telugu News