harish shankar: హరీశ్ శంకర్ ఆ ఇద్దరు హీరోలకి మాట మాత్రం చెప్పలేదట!

  • పట్టాలెక్కని 'దాగుడుమూతలు'
  • 'జిగర్తాండ' రీమేక్ కి సన్నాహాలు 
  • ఫిల్మ్ నగర్లో జోరుగా జరుగుతోన్న ప్రచారం     
హరీశ్ శంకర్ 'దాగుడు మూతలు' అనే టైటిల్ తో ఒక మల్టీ స్టారర్ ను ప్లాన్ చేశాడు. అయితే నిర్మాతలెవరూ ముందుకు రాకపోవడంతో, ఆ ప్రాజెక్టు పట్టాలెక్కలేదు. దాంతో ఆయన తమిళంలో హిట్ కొట్టిన 'జిగర్తాండ' సినిమాను తెలుగులోకి రీమేక్ చేయాలనే ఉద్దేశంతో రంగంలోకి దిగాడు. తమిళ సినిమాలో నెగెటివ్ షేడ్స్ తో కూడిన బాబీ సింహా పాత్ర కోసం రవితేజను కలవగా ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట.

ఇక హీరో సిద్ధార్థ్ పాత్ర కోసం సాయిధరమ్ తేజ్ ను కలవగా ఆయన కూడా ఓకే అనేశాడట. అయితే, ఇప్పుడు వీరిని కాదని వరుణ్ తేజ్ .. నాగశౌర్యలతో ఈ సినిమాను పట్టాలెక్కించడానికి హరీశ్ శంకర్ సన్నాహాలు చేసుకుంటున్నాడు. అయితే తాము ఓకే చెప్పినప్పటికీ తమకి మాట మాత్రమైనా చెప్పకుండా హరీశ్ శంకర్ ఇలాంటి నిర్ణయం తీసుకోవడంపట్ల, రవితేజ.. సాయిధరమ్ తేజ్ ఫీలవుతున్నట్టుగా ఫిల్మ్ నగర్లో ఒక టాక్ బలంగా వినిపిస్తోంది. ఇందులో వాస్తవమెంతన్నది చూడాలి మరి. 
harish shankar
ravteja
theju

More Telugu News