Rajamouli: రాజమౌళి సూచించిన 'bangaram saysSS'... అంటే ఏంటంటే..!

  • ఈ ఉదయం కార్తికేయ, పూజ వివాహం
  • పూజను బంగారం అని పిలిచే కార్తికేయ
  • కార్తికేయను ఎస్ఎస్ అని ముద్దుగా పిలుచుకునే పూజ
  • వివాహ వేడుకలకు 'bangaram saysSS' హ్యాష్ ట్యాగ్
తన కుమారుడు కార్తికేయకు, జగపతి బాబు అన్న కుమార్తె పూజా ప్రసాద్ కు, నేడు రాజస్థాన్ లోని జయపురాలో అత్యంత వైభవంగా వివాహాన్ని జరిపించారు దర్శకధీరుడు రాజమౌళి. ఇక ఈ పెళ్లికి సంబంధించిన వార్తలు, చిత్రాలపై అభిమానులు ఎంతో ఆసక్తిని చూపుతుండగా, సోషల్ మీడియాలో 'bangaram saysSS' అనే హ్యాష్ ట్యాగ్ హైలైట్ అవుతోంది. కార్తికేయ, పూజల వివాహ విశేషాలపై ఈ హ్యాష్ ట్యాగ్ ను వాడాలని రాజమౌళే స్వయంగా సూచించారట. ఇక ఇలా ఎందుకు పెట్టారో తెలుసా? తన భార్య పూజను కార్తికేయ ప్రేమగా 'బంగారం' అని పిలుస్తాడట. ఇక ఇదే సమయంలో పూజ, తన భర్త కార్తికేయను వాళ్ల ఇంటి పేరు అయిన 'ఎస్ఎస్' అంటుందట. అందుకే ఇలా 'bangaram saysSS' అన్న హ్యాష్‌ ట్యాగ్‌ ను రాజమౌళి సూచించినట్టు ఆయన సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి.
Rajamouli
Kartikeya
'bangaram saysSS'
Hashtag
Pooja
Marriage

More Telugu News