vishal: ఎట్టకేలకు పెళ్లిపీటలు ఎక్కబోతున్న హీరో విశాల్!

  • అనీశా అనే యువతిని పెళ్లాడనున్న విశాల్
  • పెళ్లి విషయాన్ని వెల్లడించిన విశాల్ తండ్రి
  • హైదరాబాదులో నిశ్చితార్థం
ప్రముఖ సినీ నటుడు విశాల్ తర్వలోనే ఓ ఇంటివాడు కాబోతున్నాడు. ఈ విషయాన్ని ఆయన తండ్రి, నిర్మాత జీకే రెడ్డి వెల్లడించారు. అనీశా అనే యువతిని విశాల్ పెళ్లాడబోతున్నాడు. నిశ్చితార్థ వేడుక త్వరలోనే హైదరాబాదులో జరగనుంది. నిశ్చితార్థం పనులను ప్రారంభించే పనిలో విశాల్ కుటుంబీకులు ఉన్నట్టు కోలీవుడ్ సమాచారం.

మరోవైపు, సినీ నటి వరలక్ష్మి (నటుడు శరత్ కుమార్ కుమార్తె)ను విశాల్ పెళ్లాడనున్నట్టు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పటికీ వీరి వివాహంపై చర్చ జరుగుతూనే ఉంది. ఇటీవలే ఈ అంశంపై వరలక్ష్మి క్లారిటీ ఇస్తూ... విశాల్ తనకు మంచి స్నేహితుడు మాత్రమేనని స్పష్టం చేసింది.
vishal
tollywood
kollywood
marriage

More Telugu News